త్రూ ది బైబిల్ గురించి
త్రూ ది బైబిల్ ఒక ప్రేమ వృత్తాంతం: మానవాళి కోసమైన దేవుని స్వీయ ప్రేమ వృత్తాంతం. పాత, కొత్త నిబంధనలలోని 66 గ్రంథముల ద్వారా ఇది చెప్పబడినది.
త్రూ ది బైబిల్ ఒక ప్రేమ వృత్తాంతం: మానవాళి కోసమైన దేవుని స్వీయ ప్రేమ వృత్తాంతం. పాత, కొత్త నిబంధనలలోని 66 గ్రంథముల ద్వారా ఇది చెప్పబడినది.
త్రూ ది బైబిల్ పరిచర్య కేంద్రంలో ఒక ప్రేమ వృత్తాంతం ఉంది: మానవాళి కోసమైన దేవుని స్వీయ ప్రేమ వృత్తాంతం. పాత, కొత్త నిబంధనలలోని 66 గ్రంథముల ద్వారా చెప్పబడినది – ఈ వృత్తాంతమును మనం వినిన ప్రతిసారీ శ్రేష్టమైనదిగా ఉంటుంది, ఎందుకంటే ఇందులోని ప్రతి మాట సత్యమే.
‘త్రూ ది బైబిల్’ ప్రతిదినం విస్తృత విధాల మాధ్యమాల ద్వారా దేవుని వాక్యాన్ని బోధిస్తుంది – దేవుడు అనుగ్రహించే రక్షణ, ఆయనతో నడిచే జీవితాన్ని గురించి వినదానికీ, దానికి స్పందించడానికీ మనుష్యులను ఆహ్వానిస్తుంది.
మా వ్యవస్థాపకుడు, ఉపదేశకుడు, డాక్టర్ జె. వెర్నన్ మెక్‌గీ, అన్నిటికంటే ఎక్కువగా దేవుని వృత్తాంతాన్ని చెప్పడాన్ని అమితంగా ప్రేమించారు. ఒక కాపరిగా, బైబిల్ బోధకునిగా, ఆయన 1941లో రేడియోలో బోధించడం ప్రారంభించారు, దేవుని వాక్యం నుండి సరళంగా బోధించిన అద్భుతమైన సంగతులను తన స్థానిక శాన్ గాబ్రియేల్ వ్యాలీ, లాస్ ఏంజిల్స్ ప్రాంత ప్రజలు శ్రద్ధగా విని, స్పందిస్తారని ఆయన ఆశించారు. డాక్టర్ మెక్‌గీ అంచనాలకు భిన్నంగా ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నారు.
బైబిల్ ఒక మంచి వృత్తాంతం మాత్రమే కాదు – డాక్టర్ మెక్‌గీ ఒక మంచి కథకుడు మాత్రమే కాదు – దేవుడు మనలను తన వైపుకు ఆకర్షించే ముఖ్యమైన మార్గాలలో బైబిల్ ఎల్లప్పుడూ ఒకటిగా ఉంది.
– డా. జె. వెర్నన్ మెక్‌గీ, హెబ్రీయులకు రాసిన పుస్తకాన్ని బోధిస్తూ
జాన్ వెర్నన్ మెక్‌గీ తన సరళమైన పద్ధతులు, మనోహరమైన ఆప్యాయమైన ప్రవర్తనతో చేసిన దేశీయ బోధనకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన చూసి ఆయన కంటే ఎక్కువగా ఆశ్చర్యపడినవారు మరొకరు ఉండరు.
డా. మెక్‌గీ 1904లో టెక్సాస్‌లోని హిల్స్ బోరోలో జన్మించారు. జార్జియా, టెన్నెస్సీ, టెక్సాస్‌లలో కాపరిగా పనిచేసిన తరువాత, డా. మెక్‌గీ, ఆయన సతీమణి రూత్, కాలిఫోర్నియాలోని పసడేనాలో స్థిరపడ్డారు.
1941లో, ఒకే స్టేషన్లో “ది ఓపెన్ బైబిల్ అవర్” అనే పేరుతో ఆదివారం రేడియో ప్రసారాన్ని ప్రారంభించాలని డా. మెక్గీని ఒప్పించబడ్డారు. తరువాత ఇది “హై నూన్ బైబిల్ క్లాస్”గా మార్పు చెందింది. ఇది నేడు మనకు తెలిసిన విధంగా త్రూ ది బైబిల్ 1967 ప్రారంభానికి పునాది వేసింది. లాస్ ఏంజిలెస్ లోని చర్చ్ ఆఫ్ ది ఓపెన్ డోర్ ప్రసంగ వేదిక నుండి “ఆదివారం ప్రసంగం” సందేశాలను డా. మెక్‌గీ రికార్డ్ చేశారు, అక్కడ ఆయన 1949 నుండి 1970 వరకు కాపరిగా సేవ చేశారు.
1965లో క్యాన్సర్ శస్త్రచికిత్స తరువాత డాక్టర్ మెక్‌గీ ఆరు నెలలు మాత్రమే బ్రతుకుతారని వైద్యులు చెప్పారు. అయితే దేవుడు ఆయనకు మరో 23 సంవత్సరాల ఆయుష్షును అనుగ్రహించాడు. పదవీ విరమణ తరువాత డాక్టర్ మెక్‌గీ తన జీవితాన్ని ‘త్రూ ది బైబిల్’ కార్యక్రమానికి అంకితం చేసుకొన్నారు. ఏ రోజు చూసినా, పసడేనాలోని ఆయన కార్యాలయంలో, తన బల్లపై తెరిచి ఉన్న బైబిల్‌తో, మైక్రోఫోన్‌కు ఎదురుగా డాక్టర్ మెక్‌గీ ఉండడం మీరు కనుగొంటారు.
డాక్టర్ మెక్‌గీ మరణానంతరం కూడా, రికార్డ్ చేయబడిన 5 సంవత్సరాల కార్యక్రమం ప్రసారం అవుతూనే ఉండాలని ఆయన, తన నిర్దేశక మండలి ముందుగానే ప్రణాళిక చేసారు. “ఆర్థిక వనరులు ఉన్నంతవరకు సందేశాల టేపులను కొనసాగించండి,” అని డాక్టర్ మెక్‌గీ ఆదేశించారు. 1988 డిసెంబర్ 1న, డాక్టర్ మెక్‌గీ తన కుర్చీలోనే నిద్రపోయి, మౌనంగా తన రక్షకుని సన్నిధిలోనికి వెళ్ళిపోయారు.
ఈనాడు, ‘త్రూ ది బైబిల్’ ప్రపంచవ్యాప్త కార్యక్రమం తక్కువ సిబ్బంది బృందం ద్వారానూ, అద్భుతమైన శ్రోతల ప్రార్థనలు, విశ్వాసపూర్వక కానుకల ద్వారానూ కొనసాగుతుంది – ప్రభువైన యేసు తిరిగి వచ్చువరకు దేవుని సంపూర్ణ వాక్యం ద్వారా ఈ బైబిల్ బస్సును కొనసాగించడానికి వారు కట్టుబడి ఉన్నారు.
కాబట్టి చేరండి, మీ స్నేహితులను ఆహ్వానించండి.